ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో సంచల‌నంగా మారిన మాజీ ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ వ్య‌వ‌హారం రోజు కో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇక ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లేవ‌నెత్తిన కొన్ని అంశాలు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌తంలో హైకోర్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను నియ‌మించే అధికారం రాష్ట్రాల‌కు లేద‌ని చెప్పినందున గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వ సిఫార్సుల మేర‌కే నిమ్మ‌గ‌డ్డ నియ‌మితులు అయ్యార‌ని. ఆయ‌న నియామ‌కం కూడా చెల్ల‌ద‌ని ప్ర‌భుత్వం వేసిన ఫిటిష‌న్ ఇప్పుడు ఏం అవుతుందా ? అన్న ఆస‌క్తి ఉంది. 

 

ఇక హైకోర్టు తీర్పును ర‌ద్దు చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం సుప్రీంను ఆశ్ర‌యించ‌డంతో పాటు వేసిన పిటిష‌న్‌కు నిమ్మ‌గ‌డ్డ ఎలా కౌంట‌ర్ ఇచ్చుకుంటారు ? అన్న‌ది చూడాలి. అలాగే సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించడంపైనా ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌లో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రి ఈ కేసులో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందో ?  చూడాలి. మెజార్టీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం స్ట్రాంగ్‌గ ఉండ‌డంతో నిమ్మ‌గ‌డ్డ‌కు ఈ సారి ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: