గత కొంతకాలంగా టీటీడీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ ఆ కథనంలో పేర్కొన్నారు. తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ ఈ కథను రాశాడని తెలుస్తోంది. ఈ కథపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే టీటీడీ లాంటి ధార్మిక సంస్థ పరిగణనలోకి తీసుకోవాలని.... జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్టు అవుతుందని వారు చెబుతున్నారు. టీటీడీ పత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ వచ్చిన కథపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీటీడీ ఆస్తుల వేలంపై జరిగిన రగడ మరవక ముందే టీటీడీని మరో వివాదం చుట్టుముట్టడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: