దక్షిణ అసోం లో దారుణం జరిగింది. కొండ చరియలు విరిగిపడి 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తో ఒక్కసారిగా అసోం ఉలిక్కి పడింది. అక్కడి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలకు దిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనేది తెలియాల్సి ఉంది. 

 

ఇక ఇప్పుడు వారి కోసం ప్రత్యేక సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన లో ఇంకా మరణాల సంఖ్యా పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాగా ఆ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: