తెలంగాణలో నేడు రేపు భారీగా వర్షాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. నిసర్గ తుఫాన్ ప్రభావం ఉత్తర తెలంగాణా మీద ఉండే సూచనలు ఉన్నాయి అని సమాచారం. తుఫాన్ వేగంగా దూసుకు రావడం తో అరేబియా మహా సముద్రంలో అలజడి పరిస్థితులు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి అని సముద్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి అని తెలుస్తుంది. 

 

ఇక మహారాష్ట్ర లోని నాగపూర్ తో పాటుగా పూణే అలాగే గుజరాత్ లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. దేశ వ్యాప్తంగా గత వారం రోజులనుంచి క్రమంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: