దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షల దిశగా వెళ్తున్నాయి. కరోనా కట్టడి లో చర్యలను సమర్ధవంతంగా తీసుకున్నా సరే కరోనా మాత్రం ఎక్కడా ఆగడం లేదు అనే చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు దేశంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకునే వారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు, 95,527 మంది రోగులు కోలుకున్నారని ఆయన చెప్పారు. రికవరీ రేటు ఇప్పుడు 48.07%ని అన్నారు. ఇక కరోనా రికవరీ రేటు రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: