దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రబలి పోతూనే ఉంది.  మార్చి 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నారు ప్రజలు.. ఇప్పుడు లాక్ డౌన్ 5.0 నడుస్తుంది. అయినా కరోనాని మాత్రం అరికట్టలేదు సరికదా రోజు రోజు కీ దీని ప్రభావం మరింత పెరిగిపోతుంది.  లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత ఈ కేసులు మరింతగా పెరిగిపోతున్నాయని అంటున్నప్పటికీ సరైన జాగ్రత్తలు పాటించకపోవడం ఇందుకు కారణం అంటున్నారు.  కరోనా వైరస్ కరోనా కారణంగా ముంబైలో మరో పోలీస్‌ అధికారి మరణించారు. ముంబైలో వైరస్‌ సంక్రమణకు గురైన మొత్తం పోలీసు సిబ్బంది సంఖ్య 19, మహారాష్ట్రలో మొత్తం 29 కి చేరుకున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు.

 

దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా మహరాష్ట్రాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అసిస్టెంట్‌ సబ్‌-ఇన్స్పెక్టర్‌ (ASI) సియోన్‌ ఆసుపత్రిలో గత వారం కరోనా పాజిటివ్‌తో చికిత్స కోసం చేరారు.  ‘శాంటాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌ జనరల్‌ డిపార్టుమెంటుకు అనుబంధంగా ఉన్న  ఎఎస్‌ఐ ఈ రోజు కరోనా వైరస్‌ సంక్రమణ కారణంగా మరణించారు’ అని శాంటాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీరామ్‌ కోరెగావ్కర్‌ చెప్పారు.  ప్రజలకు రక్షణ ఇస్తున్న పోలీసులు ఇలా కరోనా భారిన పడటం బాధాకరం అంటున్నారు. కాగా, మృతుడు ముంబైలోని కంటెమెంట్‌ జోన్లలో ఒకటైన ధారవి-కోలివాడ నివాసి అని అధికారులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: