వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేసు విషయంలో కోర్టు తీర్పు గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిపిందే. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయింఛింది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు, నిమ్మగడ్డపై విమర్శలు చేశారు. 
 
విజయసాయిరెడ్డి తన ట్వీట్లో నిమ్మగడ్డ లాంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పని చేయదని ప్రజలనుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ పదవి నుంచి దిగిపోయాడని బాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ కోసం చంద్రబాబెందుకు హైరానా పడుతున్నాడో? అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: