ఏపీలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింది. మ‌రో వైపు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై హైకోర్టులో వేసిన కేసును ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. ఇక ఢిల్లీ టూర్ ర‌ద్ద‌యిన వెంట‌నే జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డితో పాటు మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నానితో తాడేపల్లిలో సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌వ్వ‌డం కూడా వైసీపీ వ‌ర్గాల్లో కాస్త కాక రేపింది. అస‌లు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి అర్థం కాలేదు. 

 

ఇదిలా ఉంటే జ‌గ‌న్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ కావ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ముందు పెను స‌వాళ్లు ఉన్నాయి. లాక్ డౌన్ నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా చిన్నా భిన్నం అయ్యింది. ఇక ఆర్తిక వ్య‌వ‌స్థ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చ‌ర్చించాలి. ఇక నిమ్మ‌గ‌డ్డ కేసు విష‌యం కూడా అమిత్ షాతో చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఇక పోల‌వ‌రం నిధులు విష‌యంలో అతీ గ‌తీ లేదు. ఈ ప్రాజెక్టు నిధుల గురించి జలశక్తి మంత్రి గజేంద్ర శేకావత్ తో మాట్లాడాల్సి ఉంది. ఇక వ‌ల‌స కూలీల గురించి కూడా కేంద్రంతో మాట్లాడాల‌ని జ‌గ‌న్ అనుకున్నార‌ను. అయితే ఇప్పుడు టూర్ క్యాన్సిల్ అవ్వ‌డంతో ఈ అంశాల విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: