ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమగడ్డ రమేష్ కుమార్ ని ఉంచవద్దని ఏపీ సర్కార్ భావిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రమేష్ కుమార్ విషయంలో తమకు వ్యతిరేకంగా తీర్పు రావడం తో ఏపీ సర్కార్ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. ఇక ఇది పక్కన పెడితే దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

నిమ్మగడ్డ లాంటి వ్యక్తి SECగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయరని ప్రజలనుకుంటున్నారని ఆయన ట్వీట్ చేసారు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని... ఆయన పదవి నుంచి దిగిపోయాడని బాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడన్నారు. నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నా డో? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: