రాజ‌కీయంగా మ‌న‌దేశంలో తిరుగులేని శ‌క్తిగా ఉన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ వ‌రుస‌గా రెండోసారి తిరుగులేని మెజార్టీతో ప్ర‌ధాన‌మంత్రి అయ్యారు. ఆయ‌న మ‌న దేశానికి వ‌రుస‌గా ఆరేళ్లుగ ప్ర‌ధాన‌మంత్రిగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. మే 29 నాటికి రెండోసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన సంద‌ర్భంగా తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ సీ ఓట‌ర్ చేసిన స‌ర్వేలో మ‌న దేశ ప్ర‌జ‌లు మోదీ ప‌ట్ల సంపూర్ణ విశ్వాసం క‌న‌ప‌రిచారు. 

 

మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ఈ స‌ర్వేలో విప‌క్ష ఎంపీ రాహుల్ గాంధీకి ప్ర‌జ‌లు కేవ‌లం 23. 21 శాతం మాత్రమే మ‌ద్ద‌తు తెలిపారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే గోవా, తమిళనాడు, కేరళ… ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం నరేంద్రమోడీ కంటే స్వల్పంగా రాహుల్‌గాంధీకే ఎక్కువ మద్దతు లభిస్తున్నట్టు సీ ఓటర్స్ తెలిపింది. మే నెలలో ఈ సర్వేను నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: