IHG

తెలంగాణాలో ఒకే సారి రెండు విశేషాలు చోటు చేసు కున్నాయి. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం కావడంతో తెలంగాణ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ గారి పుట్టిన రోజు కూడా ఈ రోజే కావడం. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసారు .

 

తాజాగా తెలంగాణ గోవేర్నర్ కి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అయన తన ట్విట్టర్ కహాతు నుండి ట్వీట్ చేస్తూ ..డాక్టర్ తమిళైసాయి సౌందరరాజన్ గారు! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు (@DrTamilisaiGuv)  మీరు మంచి ఆరోగ్యం మరియు ఆనందంతో సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ఆదేవుణ్ణి కోరుకుంటున్నాను అని అన్నారు.  దానికి సమాధానం గా తమిళైసాయి సౌందరాజన్ ...మీ వెచ్చని శుభాకాంక్షలకు ధన్యవాదాలు ..అని సమాధానం ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: