ఒక పక్క కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు చాలా వరకు తక్కువగా ఉన్న కొన్ని కొన్ని ధరలు ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కూరగాయల తో పాటుగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి అని చెప్పవచ్చు. 

 

కూరగాయల ధరలు అమాంతంగా పెరగడం తో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే తినడానికి తిండి లేని పరిస్థితి ఉందని ఈ తరుణంలో ధరలను ఈ విధంగా పెంచడం ఏంటీ అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్‌సెల్‌లో రూ.50 కాగా రిటైల్‌గా రూ.60కి చేరింది. బీన్స్‌, కాకర, చామదుంప, బంగాళదుంప, వంటి కూరగాయలు రూ.30 పైనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: