దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా సరే దాదాపు 50 శాతం వరకు రికవరీ రేటు ఉంటున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రభుత్వం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ప్రతీ రోజు కూడా కనీసం 5 వేల మంది వరకు కరోనాపై విజయం సాధిస్తున్నారు. 

 

కాగా నిన్న సాయంత్రం రెండు లక్షల కరోనా కేసులు దాటగా అందులో నేటి ఉదయానికి లక్ష మందికి పైగా పూర్తిగా కోలుకున్నారు. దీనిపై ఇప్పుడు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరణాల రేటు కేవలం 3 శాతం మాత్రమే ఉంది. దేశంలో వ్రుద్దులే ఎక్కువగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: