సాహో సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిపోయిన సుజిత్ ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే అతను వివాహం చేసుకోనున్నాడు. 23 ఏళ్ళ వయసులోనే దర్శకుడిగా మారిన ఈ యంగ్ అండ్ క్రేజీ దర్శకుడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. జూన్ 10న అతని నిశ్చితార్ధం జరగనుంది.

 

అమ్మాయి పేరు ప్రవల్లిక. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేది మాత్రం స్పష్టత లేదు. ఆ రోజే పెళ్లి డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక సాహో సినిమా తర్వాత బాబు క్రేజ్ పెరిగింది. అయితే ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు. ఆ సినిమా ఫ్లాప్ కావడం అతనిని బాగా ఇబ్బంది పెట్టింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: