తుఫాన్ దెబ్బకు ముంబై తీరం వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో తీర ప్రాంతాలు అన్నీ కూడా తుఫాన్ దెబ్బకు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు ముంబై తీర ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పవచ్చు.  ఇక తీరంలో సముద్రం కూడా భయంకరంగా ఉంది. అలల తాకిడి ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ముంబైలోని వెర్సోవా బీచ్‌లో బలమైన గాలులు మరియు అలల్లో ఎక్కువగా ఆటుపోట్లు కనపడుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం చూస్తే నిసార్గా సైక్లోన్ ఈ రోజు మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య అలీబాగ్ (రాయ్‌గడ్) కి దక్షిణాన తీరం దాటే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: