బాలీవుడ్ పాపులర్ సింగర్, సాజిద్ వాజిద్ ద్వయంలో ఒకరైన వాజిద్ ఇటీవల కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇప్పుడు అతని తల్లికి కూడా కోరనా పాజిటివ్ వచ్చింది. 42 ఏళ్ళ వాజిద్ మరణించిన మరుసటి రోజే ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

 

అతని తల్లి రజీనా ఖాన్ చెంబూర్ లోని సురానా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాజిద్ కి కూడా అక్కడే చికిత్స చేసారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె నిలకడగా ఉందని... ఆమె మరిన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: