ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రెటీలు మరణిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్య కరోనాతో నటి ఖుష్బు వదిన మరణించింది.. సంగీత దర్శకుడు, సింగర్ వాజిత్ ఖాన్ కన్నుమూశారు. హాలీవుడ్ లో కూడా కరోనాతో సినీ, రాజీకీయ, క్రీడారంగానికి చెందిన వారు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్‌ సోకడంతో పాకిస్థాన్‌లోని మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ ప్రాణాలు కోల్పోయాడు. సుమారు 18ఏళ్ల కెరీర్‌లో రియాజ్‌ షేక్‌ (51) లెగ్‌స్పిన్‌తో ఆకట్టుకున్నాడు. రియాజ్‌ కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందాడని పాక్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ అధికారికంగా ప్రకటించాడు. రియాజ్‌ 43ఫస్టుక్లాస్‌ మ్యాచ్‌లు, 25లిస్టు ఎ మ్యాచ్‌లు ఆడాడు.

 

గత ఏప్రిల్‌లో పాక్‌ మాజీ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ (50) కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కోవిడ్‌ 19 వైరస్‌ కారణంగా మరణించిన రెండో క్రికెటర్‌గా రియాజ్‌ నిలిచాడు. అప్పట్లో రియాజ్ మంచి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  42మ్యాచ్‌ల్లోరియాజ్‌ 116వికెట్లు తీశాడు. వీటిలో నాలుగుసార్లు 5వికెట్లు, రెండుసార్లు10వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగస్టులో పాకిస్థాన్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లబోతుంది. ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత 14రోజులపాటు పాక్‌జట్టు క్వారంటైన్‌లో ఉంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: