దేశంలో ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే.  మార్చి  24 నుంచి కరోనా కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎవరో బయటకు రాలేదు.. ఇక సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటూ ప్రత్యేక వీడియోలు, చిట్ చాట్ చేయడం.. టిక్ టాక్ లు చేస్తూ ఎంటర్ టైన్ చేశారు.  దేశంలో టిక్ టాక్ మొదలైనప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వచ్చారు.. అలాగే పిచ్చి పనులు చేస్తూ ఎంతో మంది తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు.  తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం ఏకంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం.. టిక్ టాక్ చేయడం ఇలా ఎన్నో పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 

 

తాజాగా సెల్ఫీ మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో జరిగింది. ప్రతాప్ అనే యువకుడు రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అయితే సెల్ఫీ మోజులో ఉన్న ఆ ప్రతాప్ పైన ఉన్న హైటెన్షన్ వైర్లను గమనించలేకపోయాడు. దీంతో షాక్ తగిలి ప్రతాప్ ఘటనా స్థలిలోనే మృతిచెందాడు.  ప్రతాప్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో లక్కవరపుకోటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: