దేశంలో కరోనా ప్రతిరోజూ దాని ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.  ఒక్కోసారి వెయ్యిదాటిన కేసులు కూడా ఉన్నాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించింది కేంద్రం.  ఇప్పటికీ 5.0 లాక్ డౌన్ కంటిన్యూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చేయడానికి ఇరు ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మానసిక ధైర్యాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ సడలించిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వలస కార్మికులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరగడం మొదలు పెట్టాయి. తాజాగా ఏపిలో ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

 

ఏపీలో 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీకి చెందిన 79 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 94 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి ఏపీకి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకున్నాయి. ఏపీలో ఈరోజు 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు ఇద్దరు, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: