తుఫాన్ దెబ్బకు ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ గోవా తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. ప్రశాంతంగా ఉన్న తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం అత్యంత భయంకరంగా ఉందని అధికారులు చెప్తున్నారు. తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తుఫాన్ దెబ్బకు ఇప్పుడు అక్కడ అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. 

 

ప్రధానంగా సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు. రాయ్‌గడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం కలిగిందని... నిధి చౌదరి అనే జిల్లా మేజిస్ట్రేట్ మీడియాకు వివరించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత సేవలను మెరుగుపరుస్తామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: