ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాను కట్టడి చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు, పేరు మోసిన వైద్యులు అనేక ర‌కాల ప్రయోగాలు చేస్తున్నారు. గ‌త మూడు నెల‌లుగా క‌రోనా మందు కోసం కొన్ని వేల ప్ర‌యోగాలు జ‌రిగాయ‌న్న‌ది మాత్రం నిజం. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాకు మందు క‌నిపెట్టే విష‌యంలో స‌క్సెస్ అయ్యామ‌న్న ప్ర‌యోగం ఒక్క‌టి కూడా లేదు. అయితే తాజాగా కరోనా వ్యాధిని నయం చేసే క్ర‌మంలో పలువురు సైంటిస్టులు పెయిన్‌ కిల్లర్‌గా వాడుతున్న ఐబూప్రొఫేన్ మందుపై చేసిన ప్ర‌యోగంలో సరికొత్త అంశం వెలుగులోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

 

లండన్‌కు చెందిన గైస్‌ అండ్‌ సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌, కింగ్స్‌ కాలేజ్‌ సైంటిస్టులు ఐబూప్రొఫేన్ అనే డ్ర‌గ్ కరోనా వ్యాధిగ్రస్తుల్లో ఉండే శ్వాసకోశ సమస్యలను చాలా వరకు తగ్గిస్తుందని గుర్తించిన‌ట్టు చెపుతున్నారు. ఈ మందు వాడ‌కం వ‌ల్ల క‌రోనా రోగుల‌కు వెంటిలేట‌ర్లు వాడాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇక క‌రోనా రోగుల‌కు అయ్యే ఖ‌ర్చును చాలా వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: