వినియోగదారుల విలువైన సమాచారాన్ని దొంగలించిన కేసులో ఇప్పుడు గూగుల్ కి షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఫెడరల్ వైర్‌టాపింగ్ మరియు కాలిఫోర్నియా గోప్యతా చట్టాల ఉల్లంఘనలకు గానూ కనీసం ఒక్కో వినియోగదారుకి 5,000 డాలర్ల  నష్టపరిహారాన్ని కోరుతుంది. 

 

ప్రైవేట్ మోడ్‌లో సెట్ చేసిన బ్రౌజర్‌ల ద్వారా మిలియన్ల మంది వినియోగదారుల గోప్యతను చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపిస్తూ గూగుల్ పై కేసు నమోదైంది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఇది వినియోగదారుల స్నేహితుల, అభిరుచులు, ఇష్టమైన ఆహారాలు, షాపింగ్ అలవాట్లు మరియు వారు ఆన్‌లైన్ సెర్చ్ చేస్తున్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించినందుకు గానూ 5 బిలియన్ డాలర్ల పరిహారాన్ని గూగుల్ నుంచి వసూలు చెయ్యాలి అని పిటీషన్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: