వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. నిజమే అనుకుని ఆ రోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి... "మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను." అన్నాడంట అంటూ జగన్ పాలనపై కామెంట్ లు చేసారు.

 

ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉందన్నారు. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారన్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలన్నారు  అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: