ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరు అయినా సరే ఒకటే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎవరిని అయినా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఎంతటి వారిని అయినా క్షమించం అని తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. ఏకంగా సిఎం వాహనానికే చలానా వేసారు. సీఎం కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు‌ చలాన్లు విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

 

హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించారు. అతివేగం కారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడంతో... పెండింగ్‌ చలాన్లు రూ.4,140 చెల్లించినట్లు సీఎంవో అధికారులు మీడియాకు తెలిపారు. మరి సిఎం కే తప్పలేదు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: