కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి ప్రజలకు ఏ విధమైన ముప్పు లేకపోతే త్వరలోనే అంతర్జాతీయ విమానాలను నడుపుతామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేసారు. ఏ దేశాలకు విమాన సర్వీసులు నడపాలనే దానితో పాటు విదేశీ పర్యాటకులను అనుమతించే విషయాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని అన్నారు.

 

'వందే భారత్ మిషన్‌' మూడో దశలో మరిన్ని విమానాలను కూడా చేర్చనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాల్లో విదేశాలకు వెళ్లగోరే వారిని ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. 'వందే భారత్ మిషన్' కింద మే 6 నుంచి 312 విమానాల్లో 57,000 మంది పౌరులను వివిధ దేశాల నుంచి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: