డబ్బు సంపాదించడమే పరమావధిగా ఈ మద్య కొంత మంది ప్రతి ఒక్కటీ కల్తీ చేస్తున్న విషయం తెలిసింద. తాజాగా మేడ్చల్ జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. మేడ్చల్‌ మండలం కండ్లకోయలో ఉన్న ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు చేశారు.  భారీగా నకిలీ విత్తనాలతో పాటు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.31 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వారి బలహీనత ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

 

ఈ దాడుల్లో  రూ.18.76లక్షల విలువైన 1,210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు, రూ.12.24 లక్షల విలువైన 1,529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.  సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇలాంటి నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్‌ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో  తేడా ఉందని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: