దేశ వ్యాప్తంగా కరోనా టెస్ట్ లు ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కరోనా వైరస్ కట్టడి అయ్యే అవకాశం  ఉంటుంది. కరోనా కేసుల విషయంలో ఇప్పుడు టెస్ట్ లు చాలా కీలకంగా మారాయి అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే దేశంలో కరోనా పరీక్షలను చేసేందుకు  గానూ 13 కోట్ల రూపాయల విలువైన 74,328 ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ అందించింది. 

 

మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 28,880 ఆర్‌టీ-పీసీఆర్ కిట్లను ఆ సంస్థ అందించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (20,160 కిట్లు), మెట్రోపాలిస్ ల్యాబ్స్ (8,088 కిట్లు), అపోలో హాస్పిటల్స్(17,280 కిట్లు ) అందుకున్నాయి. భవిష్యత్తులో మరింత సాయం చేస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: