సిద్దా రామయ్య వ్యాఖ్యలతో ఒక్కసారిగా కన్నడ రాజకీయం కుదుపుకు గురిఅయింది. ఇప్పటికే యడ్డియూరప్ప పై అసంతృప్తిగా ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు తనను కలిశారంటూ రామయ్య బాంబు పేల్చాడు. వారంతా కూడా తనకు టచ్ లోనే ఉన్నారంటూ అయన స్పష్టం చేసారు. అయితే ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ మాత్రం ఇది బీజేపీ అంతర్గత విభేదాలు మాత్రమే అని వివరణ ఇచ్చింది ..తాము యడియూరప్ప ప్రభుత్వాన్ని ఎంతమాత్రం బలహీన పరచే ప్రయత్నాలు చేయబోమని స్పష్టం చేసింది.

 

అయితే ఈ విషయమై బీజేపీ అధికారిక ప్రతినిధి ప్రకాష్ మాట్లాడుతూ ..సిద్దా రామయ్య ఓడినా ఆయనకు ముఖ్యమంత్రి పదవి పై ఆశ చావలేదు అందుకే అర్ధం పర్థం లేని వ్యాఖ్యలను చేస్తున్నారని అయన మండి పడ్డాడు. బీజేపీ లో ఎలాంటి అంతర్గత గొడవలు లేవని ..అందరం బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా వైరస్ కోసం రక్షణ ఏర్పాట్లను చేయడం తోనే మాకు సరిపోతుంది ..ముఖ్యమంత్రి యడుయూరప్ప కోవిడ్-19  నియంత్రణ కోసం కష్టపడుతుంటే సిద్ధారామయ్య ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండి పడ్డాడు ..అయితే సిద్ధారామయ్య ను కలసిన 20 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి ఉమేష్ కుట్టి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: