చైనాకు ట్రంప్ మ‌రో షాక్ ఇచ్చారు. చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో కార్యకలాపాలు సాగించకుండా ట్రంప్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో జూన్‌ 16వ తేదీ నుంచి సదరు సంస్థల విమానాలు అమెరికాలోకి రావడానికి, అమెరికా నుంచి వెళ్లడానికి వీళ్లేదని రవాణా విభాగం స్పష్టం చేసింది.

 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో నిలిపివేసిన అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానాలను పునఃప్రారంభించే విషయంలో చైనా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: