కరోనా వైరస్ విషయంలో చైనాను ఎవరూ కూడా నమ్మే పరిస్థితి కనపడటం లేదు. చైనా కరోనా వైరస్ విషయంలో వ్యవహరిస్తున్న శైలి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అనేక అనుమానాలకు వేదికగా మారింది. ఈ నేపధ్యంలోనే అమెరికా సహా పలు దేశాల వ్యాపార వేత్తలు భారత్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. చాలా మంది అగ్ర దేశాల అధినేతలు ఇప్పుడు భారత్ తో దౌత్య సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు.

 

ఇటీవల ఒక వెబెనార్ కార్యక్రమంలో పాల్గొన్న యురోపియన్ దేశాల అధినేతలు భారత్ లో పెట్టుబడులు పెట్టడమే మంచిది అనే అంచనాకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వెబ్ ఈవెంట్‌ను ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్, ఇస్తాంబుల్ (ఐకెవి) నిర్వహించగా ఇందులో తమ అభిప్రాయాలను వాళ్ళు చెప్పారు. యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు, థియరీ మరియాని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని ప్రత్యామ్నాయం చూడాలి అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: