లాక్ డౌన్ కారణంగా జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గడువులు ఉన్న వారు అయితే పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. డ్రైవింగ్ లైసెన్స్ ల నుంచి ప్రతీ ఒక్కటి గడువు పూర్తి కావడంతో తమ పరిస్థితి ఏంటీ అనే ఆందోళన కొందరిలో ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో తెలంగాణా రావాన ఆశాఖ లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువుతేదీ ముగిసిన వారికి రవాణాశాఖ మరో అవకాశాన్ని కల్పించింది. 

 

గడువు పూర్తి అయినా సరే డ్రైవింగ్ టెస్ట్ కి అనుమతి ఇస్తున్నాం అని చెప్పింది. ఫిబ్రవరి నెలకు ముందు లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిస్తే మళ్లీ రెన్యూవల్‌ కోసం ఫీజు చెల్లించాలి. కాని ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత గడువు ముగిసిన వారికి మళ్ళీ అవకాశం ఇస్తామని ల్‌ఎల్‌ఆర్‌ తీసుకున్న వ్యక్తులు జూన్‌ 30 లోగా డ్రైవింగ్‌ టెస్ట్‌కు స్లాట్‌బుక్‌ చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: