కరోనా వైరస్ విషయంలో అమెరికా చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా ముందు నుంచి కూడా కరోనా విషయంలో చైనాను నానా తిట్లు తిడుతుంది. తాజాగా ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా విమానాలపై ఆయన నిషేధం విధించారు.

 

కరోనావైరస్ పట్ల స్పందనపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరగడంతో చైనా విమానయాన సంస్థలు అమెరికాలోకి వెళ్లకుండా అడ్డుకుంటామని అమెరికా ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా విమానాలను చైనా కట్టడి చేయడం తోనే అమెరికా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. విమానాలను ఒప్పందం ప్రకారం అనుమతించకుండా చైనా కట్టడి చేయడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: