మహారాష్ట్రను నిసార్గా తుఫాన్ ఏ స్థాయిలో భయపెట్టిందో అందరికి తెలిసిందే. తుఫాన్ దెబ్బకు ఆ రాష్ట్రం షేక్ అయింది. చివరికి ఆ రాష్ట్రంలో విమానాలను కూడా ఆపేశారు. ఇక విమానాశ్రయాన్ని కూడా మూసి వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఎస్‌ఎంఐఎ) బుధవారం మూడున్నర గంటలు మూసి వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 

 

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తెలిపిన వివరాల ప్రకారం... 24 స్వదేశీ విదేశీ విమానాలను తాము నిలిపివేశామని చెప్పారు. తుఫాన్ కారణంగా ముంబై నుంచి వెళ్ళే అనేక విమానాలను రద్దు చేసారు. సగానికి పైగా రోజు అంతా రద్దు చేసామని అధికారులు పేర్కొన్నారు. కాగా నిన్న సాయంత్రం తుఫాన్ అలీభాగ్ వద్ద తీరం దాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి: