అమెరికాలో ఇప్పుడు నల్ల జాతీయుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. వేలాది బలగాలతో అల్లర్లను కంట్రోల్ చెయ్యాలని అమెరికా చూసినా సరే ఇప్పుడు అక్కడ మాత్రం పరిస్థితి ఆ విధంగా కనపడటం లేదు. రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి. రాజధాని నగరం నుంచి ప్రతీ ఒక్క చోట కూడా ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే ఆందోళనలో వాషింగ్టన్ లో ఒక గాంధీ విగ్రహం ధ్వంశం చేసారు. దీనిపై అమెరికా సారీ చెప్పింది. వాషింగ్టన్ డి.సి.లోని గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండని... దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండని... కెన్ జస్టర్ అనే, భారత్ లోని అమెరికా రాయబారి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: