దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.  ఫిబ్రవరి నెల నుంచి మొదలైన ఈ కరోనా మొదట కేరళాలో ప్రారంభం అయ్యింది.  అక్కడ విదేశీయుల నుంచి వచ్చిందని అన్నారు.  ఆ తర్వాత మెల్లి మెల్లిగా దేశం మొత్తం వ్యాపించింది. అందులోనే మర్కజ్ ప్రార్థన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో మరికొంత వ్యాపించింది. మొత్తానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్నా కేసులు మాత్రం అస్సలు తగ్గడం లేదు. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ఆరు వేలు దాటింది.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 2,16,919కి చేరుకున్న‌ది. 

 

ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 2587 మంది, గుజ‌రాత్‌లో 1122 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 64,30705కు చేరుకున్న‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 385947గా ఉంది.  గ‌త 24 గంట‌ల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: