ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను ఈ నెల 6 నుంచి సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఈనెల 6వ తేదీ నుంచి కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ కోన శశిధర్ ఒక ప్రకటన లో తెలిపారు. 

 

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇక నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కేవలం ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సంచులను ఇప్పటికే రేషన్ షాపులకు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: