కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్నటివరకు 6,493,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు నమోదైన కేసులతో 65 లక్షల మార్కు దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,092,443 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
ప్రపంచంలో కరోనా మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటం కొంచెం ఊరట కలిగించే అంశం అయినా కరోనా ఎప్పుడు ఎలా సోకుతుందో అర్థం కాక ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.అమెరికాలో 19 లక్షల కేసులు నమోదు కాగా రోజూ 30,000 కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. భారత్ లో గడచిన 24 గంటల్లో 9000కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కోరల్లో చిక్కి లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: