కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంటాయి. ఆ వీడియో చూస్తున్నంత సేపు రొమాలు నిక్క‌పొడుచు కోవ‌డంతో పాటు క‌న్నార్ప‌కుండా ఏం జ‌రుగుతుందా ?  అని ఊపిరి సైతం తీసుకోకుండా చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. అదే  కోతి, కింగ్‌ కోబ్రాల ఫైట్‌. ఆస‌క్తిక‌ర వీడియోలు ఎప్పుడు త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కోతి వ‌ర్సెస్ కింగ్ కోబ్రా ఫైట్ చూడ‌డానికి తీవ్ర‌ ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు  పేర్కొన్నారు. 

 

ఇక చివ‌రిగా ఈ ఫైట్‌లో కోతి విజ‌యం సాధించ‌డం మ‌రో విశేషం. రెండు కూడా హోరాహోరీగా పోరాడినా అద్భుత పోరాటం చేసిన కోతి విజ‌యం సాధించింది. ఇది త‌న‌ను ఎంతో అబ్బుర ప‌రిచింద‌ని కూడా నందా పేర్కొన్నాడు. ఓ అడవిలో కోతి, కింగ్‌ కోబ్రాలు ఎదురెదురుపడ్డాయి. ఈ క్రమంలో పాము పడగెత్తి, కసిగా బుసలు కొడుతుంటే తొలుత కోతి భయపడుతూనే ఎదురుదాడి చేసింది. చివ‌ర‌కు కోతికి చిర్రెత్తుకొచ్చింది. అది పాము త‌ల‌నే కొరికేందుకు ప్ర‌య‌త్నించింది. చివ‌ర‌కు కోబ్రా తోక ముడిచి ప‌రారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: