అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిన్న కూతురు టిఫాని ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు ఆమె మద్దతు తెలిపారు. ట్రంప్ హింసాత్మక నిరసనలను అణచివేయని పక్షంలో సైన్యాన్ని దించుతానని చెబుతుంటే టిఫాని మాత్రం నిరసనలకు మద్దతు పలుకుతూ నలుపురంగులో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
టిఫాని ట్రంప్ "ఒంటరిగా పోరాడితే తక్కువ ఫలితం వస్తుంది.... కలిసి నడిస్తే ఎంతో సాధించవచ్చు" అని పోస్ట్ చేశారు. టిఫానీ ఆంగ్లో అమెరికన్లకు మద్దతు పలకడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టిఫానీ ట్రంప్ తల్లి, ట్రంప్ రెండో భార్య కూడా నిరసనలకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. అమెరికాలో పోలీసుల అరచాకాలను, జాతి వివక్షను వ్యతిరేకిస్తూ చాలా రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో టిఫాని వారికి మద్దతు పలకడం... తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్టులు చేయడం గమనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: