తెలుగు రాష్ట్రాల్లో కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో పకడ్భందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మంత్రులను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గోల్నాకా డివిజన్ లో అలీ కేఫ్ చౌరస్తా దగ్గర ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కాలేరు పద్మ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వేణుగోపాల్ తో కలిసి మేయర్ పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరంలో ఈ ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టామని తెలిపారు.

 

రానున్నది వర్షాకాలం కనుక పరిశుభ్రత మరింత పెంచాలని.. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కుండీల్లో నిల్వ నీటిని తొలిగించాలని తడి, పొడి చెత్తను వేరు చేస్తూ ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని సూచించారు.  ప్రజలు సైతం ఇందుకు తమ పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ వో హేమలత, ఈఈ ఆశాలత, డీపీవో రజిత, ఏఈ సంతోష్, పారిశుద్ధ్య సూపర్ వైజర్లు, కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: