తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసులు ఆ మద్య కాస్త తక్కువగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం తీవ్ర రూపం దాలుస్తున్నాయి.  ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలం చేరుకుంటున్న విషయం తెలిసిందే. వారిని క్వారంటైన్ లో ఉంచి తర్వాత తమ ఇంటికి వెళ్లమని చెబుతున్నారు అధికారులు.  కానీ ఆ తర్వాత పాజిటీవ్ కేసులు రావడం కలవరానికి గురి చేస్తున్నాయి.  తాజాగా కామారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ముంబై నుంచి 13 రోజుల క్రితం వచ్చిన ఓ మహిళ రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో తన మేనమామ ఇంటికి చేరుకుంది. సదరు మహిళను ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వైద్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించారు.

 

ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గాంధీ  ఆసుపత్రికి తరలించారు. ఇక జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో 60 ఏళ్ల వృద్ధుడు గత నెల 30వ తేదీన ఏరియా ఆసుపత్రికి వెళ్లగా దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేయడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. దాంతో అతని కుటుంబ సభ్యులు 13 మందిని క్వారంటైన్ కి పంపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: