ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసందే. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది.  ప్రతిరోజూ మరణాలు, కేసుల నమోదు జరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనాని సమూలంగా తరిమికొట్టేందుకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే కరోనాని అరికట్టవొచ్చు అని అంటున్నారు. అయితే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఇంట్లో ఉంటూ మెంటల్ గా ఫీల్ అవుతూ.. ఉన్మాధులుగా మారిపోతున్నారు.  తాజాగా చైనాలో ఘోరం జరిగింది.  ఓ స్కూల్‌లో ఉన్న 40 మంది విద్యార్థుల‌ను ఓ సెక్యూర్టీ గార్డు క‌త్తితో పొడిచాడు. 

 

 

విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌పైనా అత‌ను దాడి చేసిన‌ట్లు స్థానిక మీడియా పేర్కొన్న‌ది.  ఈ ఘ‌ట‌న సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. నిందితుడిని 50 ఏళ్ల సెక్యూర్టీ గార్డుగా గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు ఇత‌ర సెక్యూర్టీ గార్డులు కూడా ఈ దాడిలో గాయ‌ప‌డ్డారు. ఈ మద్య చైనాలో కత్తులతో దాడులకు తెగబడుతున్నారు ఉన్మాదులు.   గాంగ్జీ ప్రావిన్సులోని స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం.   ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ద్ద కూడా దాడులు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాన‌సికంగా స‌రిగా లేని వ్య‌క్తులు ఇలాంటి దాడుల‌కు దిగుతున్న‌ట్లు చైనా స‌ర్వేలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: