వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ. 36,400 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ చెల్లింపు 2019 డిసెంబర్ నుండి 2020 ఫిబ్రవరి వరకు ఉంద‌ని పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ నిధుల‌ను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

 

అదేవిధంగా శాసనసభలతో ఉన్న కేంద్ర పాలిత‌ప్రాంతాల‌కు కూడా పరిహారం లభిస్తుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక కార్యకలాపాల క్షీణత వారి ఆదాయ స్థితిని ప్రభావితం చేసినందున పూర్తి పరిహారాన్ని విడుదల చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: