మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు. వేల కేసులు నమోదు అవుతున్నాయి. గ్రామాలకు కూడా కరోనా వైరస్ అక్కడ విస్తరించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. గురువారం కొత్తగా 2,933 కేసులతో మహారాష్ట్ర మొత్తం కేసుల సంఖ్య 77,793 కు చేరుకుంది. వాటిలో 41,393 క్రియాశీల కేసులు అని తెలిపింది అక్కడి ప్రభుత్వం. 

 

ప్రభుత్వం 5 లక్షలకు పైగా కోవిడ్ -19 పరీక్షలను కూడా పూర్తి చేసింది.నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 123 మరణాలు నమోదయ్యాయి, 2,710 మంది ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ముంబై వాసాయి-విరార్, పన్వెల్, పాల్ఘర్, ధూలే, జల్నా, ఉస్మానాబాద్, నాందేడ్ మరియు యావత్మల్ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: