ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే కేసులు నమోదవుతున్నా రాష్ట్రంలో కరోనా గ్రామాల్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24 గంటల్లో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో గ్రామాల పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
జిల్లాలో ఏలూరు వన్ టౌన్ పరిధిలోని అగ్రహారంలో ఒక మహిళకు, పెదవేగి మండలం విజయరాయి గ్రామంలోని ముగ్గురికి, నరసాపురం మండలం మోడీ గ్రామంలో ఇద్దరికి, భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో ఒక మహిళకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ పల్లెలకు కూడా పాకుతూ ఉండటంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: