ఆమెకు 25 సంవ‌త్స‌రాలు.. అప్ప‌టికే పెళ్ల‌య్యింది.. భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకుని ఒంట‌రిగా ఉంటోంది. అయితే ఆమెకు త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆమె స‌మీప బంధువు అయిన 18 ఏళ్ల యువ‌కుడికి కారు, బంగ్లా, బంగారం ఆశ చూపించి ఆ 25 ఏళ్ల‌ యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నించారు. ఆ యువ‌కుడి తండ్రి కూడా కార్లు, డ‌బ్బు, బంగారానికి ఆశ ప‌డి తన కొడుకుకి ఆమెతో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యాడు.

 

అయితే ఈ పెళ్లిని యువకుడి తల్లి, సోదరి వ్యతికించారు. వీటిని పట్టించుకోకుండా యువకుడి తండ్రి ఈనెల 12న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశాడు. దీనిపై యువకుడి తల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. త‌మిళ‌నాడులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. చివ‌ర‌కు పోలీసులు, అధికారుల విచార‌ణ‌లో ఆ యువ‌కుడి వ‌య‌స్సు 21 లేద‌ని తేల‌డంతో  యువకుడి తండ్రిని హెచ్చరించారు. వివాహాన్ని ఆపేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: