భారత్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒకేరోజు దాదాపు 10,000 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,851 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.26 లక్షలు దాటింది. లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 7 స్థానంలో ఉంది. 
 
గురువారం అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడవ స్థానంలో ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో కరోనా భారీన పడి 105 మంది మృతి చెందగా 71 మంది మృతి చెందారు. తెలంగాణలో నిన్నటివరకు 2,699 కేసులు నమోదు కాగా ఏపీలో 3377 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: