ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా విల‌య తాండ‌వం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. యూర‌ప్ లో బ్రెజిల్‌, ర‌ష్యా, ఇట‌లీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో క‌రోనా క‌మ్మేసి ల‌క్ష‌లాది మంది ప్రాణాల జీవితాల‌తో చెలగాటం ఆడుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా రోగుల‌కు ఉచితంగానే వైద్యం అందించారు. అయితే రోగులు ఎక్కువ అయిపోవ‌డంతో ప్ర‌భుత్వం సైతం ఏం చేయ‌లేక చేతులు ఎత్తేస్తోంది. కొంద‌రు క‌రోనా రోగులు హాస్ప‌ట‌ల్స్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేస్తోన్న ప‌రిస్థితి కూడా ఉంది.

 

మ‌రి కొంద‌రు రోగులు వైద్యం అంద‌క వెనుదిరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా రోగుల‌కు వైద్యం అందించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు రిలీజ్ చేసింది. కోవిడ్‌-19 రోగుల నుంచి ఎలాంటి వివరాలు సేకరించకుండా అంబులెన్స్‌ నుంచి నేరుగా చికిత్స అందచేసే ప్రాంతానికి తరలించే ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. గంట‌లోగా అత‌డికి పూర్తి చికిత్స అందించాలి. 

 

అలాగే అక్క‌డ ఆహారం, నీరు కూడా అందుబాటులో ఉండాలి. అక్క‌డ బెడ్లు లేక‌పోతే వెంట‌నే మ‌రో చోట‌కు చేర్చాలి. ఈ బాధ్య‌త ఆసుప‌త్రే తీసుకోవాలి.. మ‌రో హాస్ప‌ట‌ల్‌కు రోగిని మార్చేవ‌ర‌కు రోగికి వైద్యం అందించే బాధ్య‌త కూడా ఆ హాస్ప‌ట‌ల్ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: