తాజాగా తన భర్త  ఆచూకీ తెలపాలి  అంటూ ఓ మహిళా  ఏకంగా హైకోర్టు  మెట్లెక్కింది. కరోనా  వైరస్ దృశ్య గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త సజీవంగా  ఉన్నాడా లేడా అనే విషయం తెలపాలంటూ డిమాండ్ చేసింది.తన భర్తను తన ముందు హాజరుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది సదరు మహిళ. తన భర్త ఆచూకీ తెలియకుండా ఉండేలా దాచడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. 

 


  హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది . ఇక ఈ పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వివరాలను తెలపాలంటూ  హైకోర్టు ఆదేశించింది. మహిళ తో పాటు అత్తమామల తో సహా మరో పది మంది సభ్యులు ఏప్రిల్ చివరి వారంలో కరోనా  వైరస్ పాజిటివ్ పరీక్షలు జరుపగా ఆమె భర్త అన్నయ్య కు మొదటి వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత మహిళ మరియు ఆమె భర్త అత్తమామలు వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే ఆమె భర్త సోదరుడు కోలుకోగా  ఆమె బావ ఏప్రిల్ 29న గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: