దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి లాక్ డౌన్ మొదలైంది.  దాంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాలసాల్లోకి రావడం మొదలు పెట్టాయి. ఇప్పటికే తెలంగాణలో చిరుత పులుల దాడులు.. చూస్తూను ఉన్నాం. వాటికి తోడుగా ఈ మద్య ఎలుగులు కూడా గ్రామాల్లో ఎటాక్ చేస్తున్నాయి.  అయితే ఇప్పటి వరకు చిరుత, ఎలుగు, తోడేళ్లు ఇలాలంటి జంతువులే జనారణ్యాల్లోకి వచ్చాయి.  పులులు మాత్రం జనావాసాల్లోకి రాలేదు.. సింహాల పరిస్థితి కూడా అంతే. అయితే గత ఎనిమిదేండ్లలో దేశంలో 750 పులులు వివిధ కారణాలతో మరణించాయి. ఇక పులులు ఎక్కువగా మరణించిన రాష్ట్రాల్లో ముందుగా మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర చెప్పుకోవొచ్చు. 

 

ఇక్కడ వేటగాళ్లు పులులను చంపి వ్యాపారాలు చేస్తుంటారు. ఈ విషయాన్ని ఓ ఆర్టీఐ పిటిషన్‌కు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) తెలిపింది.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో 28, అసోంలో 17. ఉత్తరాఖండ్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 12, తమిళనాడులో 11, కేరళలో 6, రాజస్థాన్‌లో మూడు పెద్ద పులులు వేటగాళ్లకు బలయ్యాయి. మిగతావి వివిధ కారణాలతో మరణించాయి.

రాష్ట్రాల వారీగా మరిణించిన పులుల సంఖ్య :

1. మద్య ప్రదేశ్ : 173
2. మహారాష్ట్ర  : 125
3. కర్ణాటక  : 111
4.ఉత్తరాఖండ్ : 88
5.తమిళనాడు : 54
6. అసోం  : 54
7.కేరళ  : 35
8.ఉత్తర్ ప్రదేశ్  : 35
9. రాజస్థాన్  : 17
10. బీహార్  : 11
11.పశ్చిమ బెంగాల్ : 11ౌ
12. ఛత్తీస్ గఢ్ : 10
13.ఒడిశా  :  7
14.ఆంధ్రప్రదేశ్ : 7
15. తెలంగాణ  : 5

 

మరింత సమాచారం తెలుసుకోండి: